- సగటున రూ. 5 లక్షలు ఖర్చు చేసే పెళ్లిళ్లు 10 లక్షలు జరుగుతాయని ట్రేడర్లు అంచనా
- రూ. కోటిపైన ఖర్చు చేసే పెళ్లిళ్లు 50 వేల పైనే
- కరోనా రిస్ట్రిక్షన్లు లేకపోవడం కలిసి వస్తోంది
బిజినెస్‌డెస్క్, వెలుగు: ఇంకో రెండు వారాల్లో వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. బంధువులు, సరదాలు, సంబరాలు.. వీటితో పాటు భారీగా చేసే ఖర్చులు. దేశంలో వెడ్డింగ్ సెక్టార్ చాలా పెద్దది. రూ. లక్షల కోట్ల బిజినెస్ జరిగే ఈ సెక్టార్‌లో అన్ ఆర్గనైజ్డ్ వ్యాపారులు కూడా బతుకుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నుంచి జులై మొదటి వారం వరకు చూసుకుంటే ఏకంగా రూ. 5 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని వ్యాపారులు అంచనావేస్తున్నారు. ఈ వెడ్డింగ్ సీజన్‌లో ఏకంగా 40 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని చెబుతున్నారు. కనీసం రూ. 5 లక్షలు ఖర్చు చేసే వెడ్డింగ్సే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ స్టార్టయ్యిందంటే చాలు జ్యూవెలరీ నుంచి రెస్టారెంట్స్, ఫుడ్, ఆటోమోటివ్ ఇలా అనేక సెక్టార్లకు ఫుల్ బిజినెస్ దక్కుతుంది. ఒక్క ఢిల్లీలోనే మూడు లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండెల్వాల్ అంచనావేశారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే రూ. లక్ష కోట్ల బిజినెస్ జరుగుతుందని చెప్పారు. కరోనా రిస్ట్రిక్షన్లు తొలగిపోవడంతో వెడ్డింగ్స్ కూడా ఫుల్ ఎరేంజ్‌మెంట్స్‌తో జరుగుతాయని అన్నారు. దీంతో వివిధ సెగ్మెంట్లలోని వ్యాపారులకు బిజినెస్ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రానున్న వెడ్డింగ్ సీజన్ 43 రోజుల వరకు కొనసాగుతుందని అంచనా. కరోనా వలన గత రెండేళ్లలో వెడ్డింగ్స్ బాగా తగ్గిపోయాయి. దీంతో వీటి చుట్టూ ఉండే బిజినెస్ కూడా తగ్గింది.
రూ. కోటి ఖర్చు చేసే పెళ్లిళ్లు 50 వేలు..
వెడ్డింగ్ కోసం కనీసం రూ. 2 లక్షలు ఖర్చు చేసే పెళ్లిళ్లు ఐదు లక్షల వరకు జరుగుతాయని సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్టియా అంచనావేశారు. సగటున రూ. 5 లక్షలు ఖర్చు చేసే పెళ్లిళ్లు 10 లక్షల వరకు జరగొచ్చని, మరో 10 లక్షల పెళ్లిళ్లు సగటున రూ. 10 లక్షలు ఖర్చు పెట్టొచ్చని లెక్కించారు. సగటున రూ. 50 లక్షలు ఖర్చు చేసే పెళ్లిళ్లు 50 వేలు, రూ. కోటి ఖర్చు చేసే పెళ్లిళ్లు మరో 50 వేల వరకు జరుగుతాయని భార్టియా పేర్కొన్నారు. వెడ్డింగ్ కోసం చేసే ఖర్చుల్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కోసం 20 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారని ట్రేడర్లు చెబుతున్నారు. మిగిలిన 80 శాతం ఖర్చును ఇతర ఏజెన్సీల కోసం ఖర్చు పెడుతున్నారని అన్నారు. వెన్యూ, వెడ్డింగ్ రిలేటెడ్ సర్వీస్‌ల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇండ్లకు పెయింట్స్ వేయడం, రీడిజైన్ చేయడం, జ్యూవెలరీ, క్లాత్స్, ఫుట్ వేర్, గ్రీటింగ్ కార్డ్స్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్స్, మోటార్ వెహికల్స్, గిఫ్ట్‌లు.. ఇలా అనేక సెగ్మెంట్లలో ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని ట్రేడర్లు పేర్కొన్నారు.