ముంబై టీమ్‌లో అర్జున్ టెండూల్కర్
అబుదాబి: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్.. ఐపీఎల్‌లో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ముంబై ఇండియన్స్‌కు నెట్ బౌలర్‌గా సేవలందిస్తున్న అర్జున్ త్వరలో అదే టీమ్‌కు ఆడే చాన్స్ కూడా ఉంది. నెట్ బౌలర్‌గా అర్జున్‌ను యూఏఈకి తీసుకెళ్లిన ముంబై ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. అయితే, క్వారంటైన్ పూర్తి చేసుకున్న అర్జున్.. ముంబై బౌలర్లతో కలిసి స్విమ్మింగ్ ఫూల్లో సేద తీరుతున్న ఫొటో వైరల్ కావడంతో విషయం బయటకు పొక్కింది. ఒకవేళ లీగ్ టైమ్‌లో ఏ ప్లేయరైనా గాయపడితే ఆ ప్లేస్‌లో అర్జున్‌ను తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
For More News..