అందరూ సంక్రాంతి పండుగ హడావిడిలో ఉండగా.. సంక్రాంతి పండక్కి ఊరెళ్లే ప్లానింగ్‌లో ఉన్న సమయంలోనే.. వాతావరణ శాఖ బాంబు పేల్చింది. రాబోయే కొద్ది రోజుల్లో.. అంటే సంక్రాంతి పండుగ తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని కేరళ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 2025, జనవరి 10వ తేదీన కేరళ వాతావరణ శాఖ రిలీజ్ చేసిన వెదర్ రిపోర్టులో ఈ మేరకు వివరించింది.
2025, జనవరి నెలాఖరులో బంగాళాఖాతంలో, హిందూ మహా సముద్రంలో తుఫాన్ ఏర్పడే సూచనలు ఉన్నాయని.. అందుకే వాతావరణంలో విపరీతమైన మార్పులు అని వెల్లడించింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కొన్ని రోజులుగా వేడి వాతావరణం ఉందని.. సంక్రాంతి పండక్కి చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతం, హిందూమహా సముద్రం నుంచి భూ వాతావరణంలోకి గాలులు పెరిగాయని.. ఈ ప్రభావంతోనే చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుందని కేరళ వెదర్ రిపోర్ట్ వెల్లడించింది.
Also Read :- సంక్రాంతి స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ
కేరళ వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రానున్న వారం రోజుల్లో అల్పపీడనం ఏర్పడ నుందని.. ఇది బలపడి వాయుగుండంగా మారనుందని తెలిపింది. ఈ అల్ప పీడన ప్రభావంతో జనవరి 12, 13 తేదీలలో కేరళలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లొద్దని సూచించింది. 2025, జనవరి 10న కేరళ,- కర్ణాటక, లక్షద్వీప్ తీరాల్లో చేపల వేటకు ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది.
2025, జనవరి 10న నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 35 నుండి 45 కి.మీ వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని.. దీని ప్రభావంతో కేరళ, తమిళనాడులో అక్కడకక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వెదర్ డిపార్ట్మెంట్. అలాగే, 2025, జనవరి 11, 12వ తేదీన దక్షిణ తమిళనాడు తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లోని కన్యాకుమారి ప్రాంతంలో గంటకు 35 నుండి 45 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్ప పీడనం సంక్రాంతి పండుగ లోపు బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని.. సంక్రాంతి పండుగ తర్వాత ఈ వాయుగుండం తీవ్రమై తుఫాన్ గా మారే అవకాశం ఉందని కేరళ వాతావరణ శాణ అంచనా వేసింది.