
అక్టోబర్ 31 వరకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: ఫొటో ఓటర్ లిస్ట్ సవరణ, పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణకు ఈసీ అవకాశం కల్పించింది. ఈ మేరకు సీఈవో శశాంక్ గోయెల్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2021 జనవరి 1 నాటికి సవరించిన ఫొటో ఓటర్ల జాబితా ప్రకటనకు షెడ్యూల్‌ను వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల పునర్వవస్థీకరణకు, ఓటర్ల జాబితాలో వ్యక్తమైన అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబరు 31 వరకు
గడువు ఇచ్చారు. డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్‌ను నవంబరు 16న ప్రకటించనున్నారు. డిసెంబరు 15 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు చేయవచ్చు. 2021 జనవరి 15న ఫైనల్ ఫొటో ఓటర్ లిస్ట్ ప్రకటించనున్నారు.