బహుజన మహిళను నిలబెడతాం

చౌటుప్పల్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున బహుజన మహిళకు  అవకాశం ఇస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన ఉన్నట్టే రాష్ట్రంలో కూడా ఉందన్నారు. తమ పార్టీని గెలిపిస్తే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, ఫ్రీ వైద్యం అందజేస్తామన్నారు. విదేశీ కంపెనీలతో మాట్లాడి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. మునుగోడులో ప్రజలే నాయకున్ని ఎంపిక చేయాలన్నారు. 119 దేశాలతో సంబంధాలు ఉన్నాయని, వారితో మాట్లాడి నిధులు తేవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.