
కొడంగల్, వెలుగు : కొత్త ఓటరుగా నమోదుకు ఈనెల 15 వరకే చాన్స్ ఉందని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. సోమవారం కొడంగల్తహసీల్దార్ ఆఫీసులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. ఫారం 6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పార్లమెంట్ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు.
కొడంగల్ సెగ్మెంట్లో కొత్తగా 7 సహాయక( యాగ్జిలరీ ) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈవీఎంల స్ర్టాంగ్ రూమ్‌ను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాలీలు, మీటింగ్‌లు, మైక్ లు , వాహనాల పర్మిషన్లకు సువిధా యాప్‌లో 48 గంటల ముందు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు విజయ్‌కుమార్, మహేష్ గౌడ్, వివిధ పార్టీలనేతలు బషీర్, రమేష్ బాబు, గుల్షన్, ముస్తాక్, కృష్ణ పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులు దళారులను ఆశ్రయించకుండా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని కలెక్టర్ లింగ్యా నాయక్ సూచించారు. బొంరాస్ పేట మండలం నాగిరెడ్డిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 122 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఈనెల 4 వరకు అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రబీ సిజన్లో లక్ష 93 వేల మేట్రిక్టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గ్రేడ్–-1కు రూ.2203, గ్రేడ్-–2కు రూ.2,183గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్సుగుణ బాయి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.