- సీఎం పర్యటన నేపథ్యంలో ప్రాధాన్యం
కాగజ్ నగర్ , వెలుగు: ఈ నెల 30న జిల్లాకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో వార్ధా నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం సర్వే పనులు మొదలయ్యాయి. సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కౌటాల మండలం గుండాయి పేట్ వద్ద వార్ధా నది పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గతంలో సీఎం కేసీఆర్కు వినతి పత్రం అందించారు. సర్వే ఏజెన్సీ బృందం సోమవారం కాగజ్‌నగర్ ఆర్అండ్ బీ డీఈ లక్ష్మినారాయణతో కలిసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టే స్థలం వద్ద సర్వే చేపట్టారు.
ALSOREAD:సీఎం మహారాష్ట్ర టూర్..సంగారెడ్డిలో బయటపడ్డ వర్గపోరు
సీఎం పర్యటనలో హై లెవెల్ బ్రిడ్జి మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్నీ కలిసొస్తే నియోజక వర్గం నుంచి మహారాష్ట్రకు అనుసంధానంగా మరో హై లెవెల్ బ్రిడ్జి మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.