
ములుగు, వెలుగు : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మహబూబాబాద్ ఎంపీ టికెట్‌ను ఆదివాసీ వ్యక్తికి టికెట్ కేటాయించకపోవడం దారుణమని ఆదివాసీ, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ చందా లింగయ్య దొర అన్నారు. శుక్రవారం ములుగులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జాతీయ ఆదివాసీ, ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు వట్టం జనార్దన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా లింగయ్య దొర, తుడుందెబ్బ రాష్ర్ట అధ్యక్షుడు వట్టం ఉపేందర్ హాజరై మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో ఆదివాసీలు అత్యధికంగా ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం టికెట్ కేటాయించకుండా తమను విస్మరించారని ఆరోపించారు.