హైదరాబాద్ : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను చందానగర్, TSNAP పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాకు చెందిన ప్రధాన నిందితుడు అఖిల్(24)తో పాటు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన అఖిల్.. గోవాలో ఉంటూ హాస్టల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. గోవాకు వచ్చే టూరిస్ట్ లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గోవాకు వెళ్లిన సందర్భంలో మిగతా నిందితులకు అఖిల్ తో పరిచయం ఏర్పడింది. వీరంతా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న క్రమంలో పక్క సమాచారం పోలీసులకు అందింది. దీంతో చందానగర్, TSNAP పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న అఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ | రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం : ఎంపీ ఉత్తమ్
నిందితుల వద్ద నుండి 18 గ్రాముల MDMA డ్రగ్, ఒక ద్విచక్ర వాహనం, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.