మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌లోని ఎంపీ మాలోతు కవిత ఇంటి వద్ద సోమవారం చండీ యాగం, అరుణ హోమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లోకకల్యాణం కోసమే చండీయాగం నిర్వహించినట్లు ఎంపీ తెలిపారు.
అలాగే ఎంపీ పుట్టిన రోజు కావడంతో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డితో పాటు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ లీడర్లు, నాయకులు, కార్యకర్తలు బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.