
2008నాటి అవినీతి కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నిర్మల యాదవ్కు క్లీన్చిట్ ఇచ్చింది ప్రత్యేక సీబీఐ కోర్టు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో చండీగఢ్ పోలీసులు 2008 ఆగస్టు 13న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అవినీతి కేసులో సిట్టింగ్ జడ్జిపై నమోదైన తొలి కేసు ఇదే. చండీగఢ్‌లోని జిల్లా కోర్టులో ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి అల్కా మాలిక్ ఈ తీర్పునిచ్చారు.
ప్రాసిక్యూషన్ ప్రకారం..రూ.15లక్షల నగదు ప్యాకెట్ పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నిరల్ జిత్ కౌర్ యాదవ్ ఇంటికి పొరపాటున డెలివరీ చేశారు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ నగదు జస్టిస్ నిర్మల్ యాదవ్ కోసమే అని పోలీసులు తెలిపారు. 2007లో పంచకులలోని ఓ ఆస్తి వివాదంలో అనుకూల తీర్పుకోసం కొందరు ఈ డబ్బులు పంపించారని ఆరోపణలు ఉన్నాయి. అదనపు అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్, ఆస్తి డీలర్ రాజీవ్ గుప్తా, ఢిల్లీకి చెందిన హోటలియర్ రవీందర్ సింగ్ భాసిన్ లకు అనుకూలంగా తీర్పు కోసం ఈ నగదు చెల్లించారనేది ఆరోపణ.
ALSO READ | ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ వచ్చారు.. శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. డీసీపీ మృతి
2008లో బయటపడిన ఈ కుంభకోణంతో జస్టిస్ యాదవ్ సెలవుపై వెళ్లారు. తరువాత ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సంఘటన జరిగిన 15రోజులకు కేసును సీబీఐకి అప్పగించారు. సుప్రీంకోర్టు, సీబీఐ అంతర్గత ప్యానెల్ విచారణ చేసింది. తర్వాత జసిస్ట్ యాదవ్ ను జూలై 2012లో రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆమె 2018లో పంజాబ్,హర్యానా హైకోర్టుకు తిరిగి జస్టిస్ గా వచ్చారు. 2021లో పదవీ విరమణ చేశారు.
ఈ కేసులో సీబీఐ సమర్పించిన ఫైనల్ రిపోర్టును సీబీఐ కోర్టు తిరస్కరించింది. కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఏజెన్సీని ఆదేశించింది. జస్టిస్ నిర్మల్ యాదవ్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి అనుమతినిచ్చింది. రాష్ట్రపతి కూడా మార్చి 1, 2011 విచారణకు అనుమతిచ్చారు. 2014న జస్టిస్ నిర్మల్ యాదవ్ తో పాటు ఈ కేసులో మిగతా నిదింతులపై అభియోగాలు మోపాలని సీబీఐకోర్టు ఆదేశించింది. విచారణ 2014 మార్చి 27న ముగిసింది.
ఈ కేసుకు సంబంధించిన 17 ఏళ్లలో కనీసం 300 సార్లు విచారణ చేపట్టారు. చివరికి శనివారం (మార్చి 29,2025)న అవినీతి కేసులో అప్పటి పంజాబ్, హర్యానా మాజీ జస్టిస్ నిర్మల్ యాదవ్ కు క్లీన్ చిట్ ఇచ్చింది సీబీఐ కోర్టు.