రెక్కల పురుగులతో చాందిపుర వైర‌స్ : నలుగురు చిన్నారులు మృతి

దోమ‌లు, పురుగుల ద్వారా వ్యాప్తించే చాందిపుర వైరస్ గుజరాత్ లో నలుగురు పిల్లల్ని బలితీసుకుంది. స‌బ‌ర్‌కాంతా జిల్లాలో చాందిపుర వైర‌స్ సోకి న‌లుగురు చిన్నారులు మృతిచెందారు. ప్రస్తుతం హిమ‌త్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో మ‌రో ఇద్దరు పిల్లలు చాందిపుర వైరస్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. చాందిపురా వైర‌స్ కేసుల్లో జ్వరం ల‌క్షణాలు క‌నిపిస్తాయి. ఆ వైర‌స్ సోకిన వారికి ఫ్లూ లాంటి ల‌క్షణాలు కూడా ఉంటాయి. తీవ్ర స్థాయి ఇన్‌సెఫ‌లైటిస్ కూడా వ‌స్తుంది. 

ఆరుగురు చిన్నారుల‌కు బ్లడ్ శాంపిల్స్ పుణెలోని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి పంపారు. రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు స‌బ‌ర్‌కాంత జిల్లా ఆరోగ్యశాఖ అధికారి రాజ్ సుతారియా తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇద్దరు కూడా రాజస్థానీయులే. ర‌క్షణాత్మక చ‌ర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో రెక్కల పురుగుల‌ను చంపుతున్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారిలో ఒక‌రు స‌బ‌ర్ కాంత్ జిల్లా వాసి కాగా, ఇద్దరు ఆరావ‌లి జిల్లా వాసులున్నారు. మరొకరు రాజ‌స్తాన్‌కు చెందిన వ్యక్తి.

ALSO READ | ఏంటీ విచిత్రం : ప్రతి శనివారం ఆ పాము అతన్ని కాటేస్తుంది..