
సినిమాకి భాష అక్కర్లేదు. భావం అర్థమైతే చాలు’’ అని కొందరు.. ‘‘సినిమానే ఒక లాంగ్వేజ్’’ అని మరికొందరు అంటుంటారు. అయితే ‘‘ఏ భాషలో నటిస్తే ఆ భాష మీద పట్టు ఉండాలి. దానివల్ల నటించడం సులభమవుతుంది’’ అంటోంది ఈ యాక్ట్రెస్. ఈ విషయంలో తను మొదట్నించీ సిద్ధంగా ఉన్నాననంటోంది. ఇంతకీ ఆమెవరంటే.. నటి చాందిని. లేటెస్ట్గా ఓటీటీకి వచ్చిన ‘ప్రావింకుడు షాపు’ అనే మలయాళ సినిమాలో నటించింది. ఆ సినిమా ముచ్చట్లతోపాటు తన జర్నీ విశేషాలు ఈ వారం పరిచయంలో...
చాందిని తల్లిదండ్రులు రజనీ, శ్రీధరన్ సురేంద్రన్. కేరళలోని కాలికట్లో పుట్టిన చాందిని.. అమెరికాలో పెరిగింది. 2013లో ‘అయితు అయితు అయితు’ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో చక్కిలిగింత’ అనే సినిమాలో నటించింది. మలయాళం, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. ఈ మలయాళ నటి చాందినికి రిహన్నా, రెహానా, మ్రితిక అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే అవి ఇండస్ట్రీకి వచ్చాక పెట్టుకున్న పేర్లు. పేరు మార్చుకుంటే కలిసి వస్తుందనే నమ్మకంతో కొంతమంది మార్చారట. కానీ, అవి వర్కవుట్ కాకపోవడంతో అసలు పేరుతోనే కొనసాగుతోంది. అందుకు తను చాలా సంతోషంగా ఉన్నట్లు ఓ సందర్భంలో చెప్పింది.
ఒక్కమాటలో చెప్పలేం!
ప్రావింకుడు షాపు’’ సినిమా డార్క్ కామెడీ జానర్లో తెరకెక్కింది. ఇలాంటి సినిమాలను ఒక్కమాటలో వివరించలేం. డార్క్ హ్యూమర్‌ని రకరకాల ఆడియెన్స్ వేర్వేరుగా రిసీవ్ చేసుకుంటారు. ఈ సినిమా విషయానికొస్తే ఇందులో టెక్నికల్ విషయాలు ప్రజలకు చాలా నచ్చుతాయి. ఈ సినిమాలో నేను ‘మెరిండా’ అనే పాత్రలో నటించా. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలాంటి పాత్రలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. మొదట నాకు ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు విచిత్రంగా అనిపించింది. పైగా ఇందులో ఒక పాత్రలో రకరకాల షేడ్స్ ఉంటాయి. మెరిండా లాంటి క్యారెక్టర్ ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. అలాంటి ఒక పాత్ర రాసిన డైరెక్టర్ శ్రీరాజ్ శ్రీనివాసన్ నిజంగా చాలా గ్రేట్. మెరిండా పాత్ర కోసం కొంచెం ప్రిపరేషన్ జరిగింది.
ఎందుకంటే నేను అప్పుడు ఉన్న పర్సనాలిటీకి, ఈ క్యారెక్టర్‌కి అస్సలు సూట్ అవ్వదు. అందువల్ల జుట్టు, స్కిన్ టోన్‌తో సహా లుక్ మార్చేశారు. షూటింగ్ టైంలో నేను మేకప్ కోసం ఒక గంట లేదా గంటన్నర పట్టొచ్చు అనుకుంటూ వెళ్తా. కానీ మొత్తం లుక్ పూర్తయ్యేసరికి రెట్టింపు సమయం కేటాయించాల్సి వచ్చేది. అయినప్పటికీ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉండేది. ఒక్కసారి నేను మేకప్, కాస్ట్యూమ్ వేసుకుని సెట్లోకి వెళ్లగానే నా బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయేది. బాడీ లాంగ్వేజ్ కోసం మేకప్, కాస్ట్యూమ్ నిజంగా చాలా హెల్ప్ అయ్యాయి. లేదంటే నేను అంత ఇన్వాల్వ్ కాలేకపోయేదాన్ని. జస్ట్ ఒక పాత్రలా ఫీలయ్యి మాత్రమే నటించేదాన్ని. డైరెక్టర్ విజన్ వల్లే నేను అలా నటించగలిగా. ఇప్పటికే నా రోల్‌కి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది.’’
సూపర్ హీరో సినిమాలంటే ఇష్టం
చదువుతోపాటు అమెరికాలోనే డ్యాన్స్, మ్యూజిక్‌లలో శిక్షణ కూడా తీసుకుంది. ఈ విషయం గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘యాక్టింగ్ కంటే ముందు డాన్స్, సింగింగ్ నేర్చుకున్నా . కాబట్టి అవకాశం వస్తే అందులోనూ నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకున్నా. ఇప్పటికీ డాన్స్ వేసే చాన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా . నేను పాటలు కూడా పాడగలనని చాలామందికి తెలియదు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నా” అంటూ తన మనసులోని కోరిక బయటపెట్టింది.
అంతేకాకుండా సినిమాల విషయంలో తన అభిరుచిని కూడా ఇలా పంచుకుంది. ‘‘నేను అమెరికాలో పెరగడం వల్ల అక్కడి హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. నాకు సూపర్ హీరో సినిమాలంటే చాలా ఇష్టం. పైగా అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు నేను నా మాతృభాషలో నటిస్తున్నా. మలయాళం మూవీల్లో అలాంటి ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎక్కువగా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటాయి. ప్రజలకు కచ్చితంగా రిలేట్ అవుతారు. ఇండస్ట్రీ ఏదైనా కూడా మంచి కథలను చెప్పడానికి ప్రధాన వనరు సినిమానే. మలయాళం సినిమా నేచురల్, అథెంటిక్ స్టోరీస్ కేరళ కల్చర్‌ని చూపిస్తాయి. దాంతో ఇక్కడి సినిమాలకు నేను కూడా కనెక్ట్ అయ్యా.’’
కొత్త నటులు పరిచయమవుతారు
ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవ్వడం చాలా మంచి విషయం. దానివల్ల ఇతర భాషల వాళ్లకు కొత్త కథలు తెలుస్తాయి. కొత్త నటులు పరిచయమవుతారు. సినిమాలు లేదా సిరీస్‌లకు ఆడియెన్స్ పెరుగుతారు. ఈమధ్యకాలంలో డబ్బింగ్ చేయకపోయినా చాలామంది మలయాళం సినిమాలను సబ్‌టైటిల్స్‌తో చూసేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ చూడాలనే ఆశ ఆడియెన్స్‌లో ఉంది. మలయాళం ఇండస్ట్రీ ఆడియెన్స్‌ను కట్టిపడేసే కంటెంట్ తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.”
మాతృభాషలో మాట్లాడడం..
‘ప్రావింకుడు షాపు’ సినిమాలో గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే యాసతో మలయాళంలో మాట్లాడాలి. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘‘ నేను అమెరికాలో ఉన్నప్పటికీ మలయాళం బాగా మాట్లాడుతున్నానంటే అందుకు కారణం మా ఫ్యామిలీనే. ఇంట్లో అమ్మానాన్న, అన్నయ్య అందరం మలయాళంలోనే మాట్లాడుకునేవాళ్లం. అందుకే మలయాళం బాగా మాట్లాడుతున్నా. రాయడం, చదవడం కూడా నేర్చుకున్నా. మరికొన్ని ఇండియన్ లాంగ్వేజెస్ కూడా నాకు వచ్చు. అయితే ఇండస్ట్రీకి వచ్చాక ఇక్కడివాళ్లు రకరకాల యాసల్లో మాట్లాడుతుంటే డిఫరెంట్‌గా అనిపించేది.
ఈ సినిమాలో మెరిండా మాట్లాడే యాస కూడా కొత్తగా ఉంటుంది. త్రిస్సూర్‌లోని గ్రామీణ ప్రాంత ప్రజలు మాట్లాడే తీరు అది. నటీనటులంతా ఆ యాసలోనే మాట్లాడాలని డైరెక్టర్ పట్టుబట్టారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా డైరెక్టర్ నాకు చాలా విషయాలు నేర్పించారు. యాసలో మాట్లాడితేనే ఆ ఫీల్ వస్తుందనే ఉద్దేశంతో నేను కూడా చాలా కష్టపడ్డాను. అది నా క్యారెక్టర్‌కి చాలా హెల్ప్ అయింది.’’
కొత్త నటులు పరిచయమవుతారు
ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవ్వడం చాలా మంచి విషయం. దానివల్ల ఇతర భాషల వాళ్లకు కొత్త కథలు తెలుస్తాయి. కొత్త నటులు పరిచయమవుతారు. సినిమాలు లేదా సిరీస్‌లకు ఆడియెన్స్ పెరుగుతారు. ఈమధ్యకాలంలో డబ్బింగ్ చేయకపోయినా చాలామంది మలయాళం సినిమాలను సబ్‌టైటిల్స్‌తో చూసేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ చూడాలనే ఆశ ఆడియెన్స్‌లో ఉంది. మలయాళం ఇండస్ట్రీ ఆడియెన్స్‌ను కట్టిపడేసే కంటెంట్ తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.”
తెలుగు, తమిళంలో బాగా మాట్లాడతా..
ఇతర భాషల్లో నటించడం చాలెంజింగ్‌గా అనిపిస్తుంది చాలామందికి. కానీ, ఆ విషయంలో తాను ఎప్పటినుంచో రెడీగా ఉన్నట్టు చాలాసార్లు చెప్పింది. ‘‘ఈ ఫీల్డ్‌లో భాషను త్వరగా పట్టుకోవడం చాలా అవసరం. అది వేర్వేరు భాషల్లో నటించేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. అదికాక నాకు భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఇతర భాషలు నేర్చుకోవడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. తెలుగు, తమిళంలో మాట్లాడితే నా యాస చాలా బెటర్‌గా ఉంటుందని చాలామంది చెప్తుంటారు. నేను నా స్క్రిప్ట్స్, డైలాగ్స్ ఏ భాషలో ఇచ్చినా చదువుతాను.
సరిగా మాట్లాడేవరకు ప్రాక్టీస్ చేస్తాను. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేదు. ఏ భాషలో నటించడానికైనా రెడీగా ఉన్నా. ఎన్నో రకాల పాత్రల్లో నటించాలనే కోరిక ప్రతి యాక్టర్‌కీ ఉంటుంది. అలాగే నాక్కూడా ఉంది. ఒక్కో కథలో ఒక్కో పాత్ర చేయొచ్చు. కాబట్టి భాష ఏదైనా సినిమాల్లో నటించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది” అంటుంది చాందిని.