చంద్రబోస్, కొమురమ్మ, మొగిలయ్యకు ‘పొన్నం సత్తయ్య’ స్మారక అవార్డు

చంద్రబోస్, కొమురమ్మ, మొగిలయ్యకు  ‘పొన్నం సత్తయ్య’ స్మారక అవార్డు

ఈ నెల 13న రవీంద్ర భారతిలో అవార్డుల ప్రదానం  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం యేటా రచయితలు, కళాకారులకు అందించే అవార్డులకు ఈ ఏడాది సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, కళాకారుల విభాగంలో బలగం ఫేమ్​ కొమురమ్మ, మొగిలయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో ఎంపిక కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర మీడియాకు వివరాలను వెల్లడించారు. 

రీ కమిటీలో సీనియర్ పాత్రికేయులు, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రచయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మి సభ్యులుగా ఉన్నారని చెప్పారు. కమిటీ పలువురు రచయితలు, కళాకారుల పేర్లను పరిశీలించిందన్నారు. ఫైనల్​గా చంద్రబోస్, కొమురమ్మ, మొగిలయ్యను ఎంపిక చేసినట్టు చెప్పారు. 

నెల 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో అవార్డులను ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. అవార్డు గ్రహీతలకు రూ.51 వేల నగదు, మెమోంటో అందజేస్తా మన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  హాజరుకానున్నారని తెలిపారు.