యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేయనున్నారు. అందుకే గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తున్న ఆజాద్ సమాజ్ పార్టీ ఈనెల 18న 33 మంది అభ్యర్థులను ప్రకటించింది. సమాజ్ వాదీ పార్టీతో చంద్రశేఖర్ ఆజాద్ పొత్తు కోసం ప్రయత్నించారు. సీట్ల సర్దుబాటు విషయంలో సఖ్యత కుదరకపోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు యోగి అదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి ఐదుసార్లు ఎంపిగా గెలుపొందారు. ఇక్కడ బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం తన సత్తా ఏంటో చూపిస్తానని..గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం