టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల రెండో జాబితాపై ,బీజేపీతో పొత్తు, ఢిల్లీలో నెలొకొన్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బీజేపీని కూడా తమతో కలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి పొత్తు అంశం గురించి చర్చించినా కూడా పొత్తుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు బీజేపీ.
బీజేపీ నుండి ఎలాంటి క్లారిటీ రాకముందే టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించి ఉమ్మడి బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా వెళ్లాలని డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్న బాబు, పవన్ కళ్యాణ్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన ప్రకటించాల్సిన మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కూడా ఈ భేటీలో ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ప్రకటించనున్న రెండో జాబితాలో టికెట్ దక్కించుకునే అభ్యర్థులెవరు, బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అన్న అంశాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.