రూ. 240 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో .. చంద్రబాబుపై నమోదైన సెక్షన్లు ఇవే..

చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ  స్కిల్ డెవలప్‍మెంట్ అవినీతి కుంభకోణం కేసులో AI నిందుతుడి గా ఉన్న చంద్రబాబును అరెస్ట్‌ చేశారు.  చంద్రబాబు అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు ఆయన్ను..విజయవాడకు తరలించే అవకాశం ఉంది. 

మరోవైపు ఏపీ  స్కిల్ డెవలప్‍మెంట్ అవినీతి కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. CRPC సెక్షన్ 50(1) కింద చంద్రబాబుకు సీఐడీ పోలీసులు నోటీసులు  ఇచ్చారు. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ipc సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.