ప్రక్షాళన తిరుమల నుండే ప్రారంభిస్తా.. చంద్రబాబు

ఏపీ సీఎంగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల సందర్శించారు.సీఎం హోదాలో స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని, 2003లో వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించారని అన్నారు. 

ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని, సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో అది పేదవారికి అందాలని అన్నారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని,పేదిరకం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తానని అన్నారు చంద్రబాబు.నేటి నుంచి ప్రజాపాలన మొదలైందని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.నేరాలు చేసి తప్పించుకోవాలంటే కుదరదని అన్నారు. కొందరు దాడులు చేసి మళ్లీ తమ మీద ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే సహించేది లేదని అన్నారు. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని, తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదని అన్నారు సీఎం చంద్రబాబు.