2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ చేరింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారం జోరుగా నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఈ క్రమంలో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన, టీడీపీ ప్రచారం కూడా ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి ప్రచారంలో భాగంగా పి. గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
జగన్ మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అని, 186 మంది దళితులను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దళితులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు, మాదిగలకు ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాపులకు న్యాయం చేస్తామని మాటిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదల సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటుచేసి పూర్వ వైభవం తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.