ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వం ఒకవైపు, నేతల ప్రచారం ఒకవైపు వెరసి రాషట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. ఆముదాలవలసలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న టీడీపీ ఏదినేత చంద్రబాబు సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా, జగన్ ను నమ్మి మోసపోవద్దని అన్నారు.
చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా అప్పుగా ఇచ్చారని, తల్లిదండ్రుల వాటా కూడా చెల్లికి ఇవ్వాల్సింది పోయి, అప్పుగా ఎవరైనా ఇస్తారా అని అన్నారు. జగన్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. తన హయాంలో అమలు చేసిన డ్వాక్రా సంఘాలు, దీపం వంటి పథకాలను గుర్తు చేశారు చంద్రబాబు.