అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. అధికార ప్రతిపక్షాలు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతల మాటల యుద్ధం కూడా పతాక స్థాయికి చేరింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ విద్య విలువ తెలియని వ్యక్తి అని, కరోనా సమయంలో ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద కాపలా నిలబెట్టి అవమానించారని అన్నారు.
అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా చేయగల సత్తా ఉన్న పార్టీ టీడీపీ అని అన్నారు. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను లాక్కునే కుట్ర చేస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఈ యాక్ట్ ని రద్దు చేస్తామని అన్నారు చంద్రబాబు.