అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో నేతల మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఎన్నికలకు తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయాయి. ఇరు వర్గాలు మేనిఫెస్టోను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మెడకు ఉరేసే సమయం వచ్చిందని, మే 13న వైసీపీకి, ఫ్యాన్ కు ఉరేసి సైకిల్ కి పట్టం కట్టాలని, ఆ తర్వాత మీ జీవితాలు అన్ స్టాపబుల్ అని అన్నారు.
ఫ్యాన్ ను చిత్తుచిత్తుగా ఓడించి చెత్తబుట్టలో పడేయాలని, అడ్డు ఎవరొస్తారో చూస్తానని, మీకు అండగా నేనుంటానని అన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో రాతియుగం పోయి స్వర్ణయుగం రావాలంటే టీడీపీని గెలిపించాలని అన్నారు. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు గడప కూడా దాటటం లేదని అన్నారు. జగన్ ఒక సైకో, మోసకారి, అహంకారి, విధ్వంసకారుడు, నియంత బందిపోటు దొంగ అని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ పైన, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు మీద పెదతానని అన్నారు.