జాబు కావాలంటే బాబు రావాలి... గంజాయి కావాలంటే జగన్ ఉండాలి.. చంద్రబాబు 

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు మరో తొమ్మిదిరోజుల సమయం మాత్రమే ఉన్న క్రమంలో నేతలంతా ప్రచారంలో మునిగిపోయారు.ఈ క్రమంలో నేత విమర్శ, ప్రతివిమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. దర్శిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని, గంజాయి కావాలంటే జగన్ ఉండాలని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ గంజాయి హబ్ మార్చేశారని మండిపడ్డారు.

జగన్ మేనిఫెస్టో వెలవెల పోయిందని, కూటమి మేనిఫెస్టో కళకళలాడుతోందని అన్నారు. తన హయాంలో రెండువేల రూపాయల పెన్షన్ ఇచ్చానని, జగన్ అబద్దాలను నమ్మొద్దని అన్నారు. రాష్ట్రంలో సూపర్ 6మేనిఫెస్టోతో టీడీపీ, కేంద్రంలో మోడీ గ్యారెంటీలతో బీజేపీ పేదలకు అండగా ఉంటుందని అన్నారు. వృద్ధులందరికీ రూ.4వేల రూపాయల పెన్షన్ ఇస్తామని, ఏప్రిల్ నుండే పెంచిన పెన్షన్ అమలు చేసి, జులైలో 7వేల రూపాయలు ఇస్తామని అన్నారు.