
సీఎం జగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ అన్ని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు.RRR చిత్రానికి ఆస్కార్ కాదు కానీ అసలైన ఆస్కార్ కోడికత్తి డ్రామా ఆడిన కమల్ హాసన్ కు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని చంద్రబాబు విమర్శించారు. జగన్ రూ.10 ఇచ్చి రూ. 100 లాక్కుంటున్నాడని విమర్శించారు. మనం వెంకటేశ్వరస్వామికి నిలువు దోపిడీ ఇస్తాం...కానీ జగన్ మనల్ని నిలువు దోపిడీ చేస్తున్నాడని చెప్పారు. తన జీవితంలో ఇంత దోపిడీదారున్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని జగన్ అన్న చంద్రబాబు... రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలన్నారు.