తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారు.. చంద్రబాబు 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేతలంతా ఆఖరి దశ ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో గన్నవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీఆ దినేత చంద్రబాబు సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ పాలనలో  ఒక్కరు కూడా సంతోషంగా లేరని అన్నారు చంద్రబాబు.

తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్న చంద్రబాబు జగన్ ఫోటో ఉన్న పాస్ బుక్ ని చించేశారు. తాడేపల్లిలో పెద్ద సైకో ఉన్నారని, గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని జగన్, వల్లభనేని వంశీలను ఉద్దేశించి అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న పార్టీ తమదేనని అన్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చిన ప్రజలని గుర్తుంచుకుంటానని, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు చంద్రబాబు.