ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం.. చంద్రబాబు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు క్లైమాక్స్ చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో నేతలంతా ఈ కొద్ది సమయంలో ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. నంద్యాలలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ పైన,రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన పెడతానని అన్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని బలంగా టీయూకెళ్లింది టీడీపీ. మరో పక్క వైసీపీ ఈ యాక్ట్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపాదించిందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని, మోడీ అమిత్ షాల మీటింగ్ లో ప్రస్తావించే దమ్ము లేదని టీడీపీకి కౌంటర్ ఇస్తోంది. ఈ అంశంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తొందని వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ సీఐడీ దర్యాప్తుకు కూడా ఆదేశించిన క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఏ మేరకు ప్రభావం చూపుతాయి అన్నది వేచి చూడాలి.