ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది.అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది.వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో రోడ్ షోలు బహిరంగ సభలతో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జగన్, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం ఆసక్తిగా మారింది.
పేదలంటే మరీ ఇంత చిన్నచూపా @ncbn?
— YSR Congress Party (@YSRCParty) March 29, 2024
వైయస్ఆర్సీపీకి సుదీర్ఘకాలంగా నిజాయతీగా పనిచేస్తున్న సామాన్య కార్యకర్త వీరాంజనేయులకి శింగనమల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం @ysjagan గారు
నిరుపేద దళితుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఓర్వలేక ఎగతాళి చేస్తూ పెత్తందారి బుద్ధి చూపించావ్ కదా?
నీకు… pic.twitter.com/lT6OsjyeYO
వైసీపీ సింగనమల అసెంబ్లీ టికెట్ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకు ఇవ్వడంపై చంద్రబాబు సెటైర్లు వేశాడు. జగన్ టిప్పర్ డ్రైవర్లకు, వేలి ముద్ర గాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఈ విమర్శలపై స్పందిస్తూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఎమ్ఏ ఎకనామిక్స్ చేసి బీఈడీ చేసిన విద్యావంతుడు అని, బాబు హయాంలో ఉద్యోగం రాక టిప్పర్ డ్రైవర్ అయ్యాడని అన్నారు. తాను టికెట్ ఇచ్చింది పేదవాడికి అని, టిప్పర్ డ్రైవర్ అని హేళన చేసిన వీరాంజనేయులును ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపుతానని అన్నారు.