ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానన్నాడు: చంద్రబాబు

ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానన్నాడు: చంద్రబాబు

నందమూరి తారకరత్న కోలుకుని తిరిగి వస్తారని అనుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజయాల్లో ఉంటానని... ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని తారకరత్న స్వయంగా తనతో చెప్పారని ఆయన తెలిపారు. అమరావతి సినిమాలో విలన్ పాత్రలో నటించిన తారక్‭కు ఉత్తమ విలన్ అవార్డు వచ్చిందని బాబు గుర్తుచేశారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తిరిగి రాని లోకాలకు వెళిపోవడం బాధగా ఉందన్నారు. బెంగుళూరు నారాయణ హృదయాలయా వైద్యులు తారకరత్నను బతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని చంద్రబాబు అన్నారు. తారకరత్న కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన తరపు నుంచి ఆ కుటుంబానికి సహాయపడతానని చంద్రబాబు తెలిపారు.