టీడీపీ అభ్యర్థులకు బీఫారంలు.. లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్ ఇచ్చిన చంద్రబాబు...

ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. మొన్నటిదాకా టికెట్ల కేటాయింపుతో బిజీగా ఉన్న పార్టీల అధిష్టానాలు ఇప్పుడు ఎన్నికల ప్రచారం, నామినేషన్లలో నిమగ్నం అయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు బీఫారంలు పంపిణీ చేశారు. ముందుగా ఊహించినట్టుగానే ఉండి నియోజకవర్గం టికెట్ రఘురామరాజుకు కేటాయించారు బాబు. ఉండి టికెట్ ఆశిస్తున్న మంతెన రామరాజుకు నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు.

ఉండి నియోజకవర్గంతో పాటు మడకశిర, పాడేరు, మాడుగుల, వేంకటగిరి నియోజకవర్గాల అభ్యర్థులను మార్చారు బాబు. మాడుగుల టికెట్ ను సీనియర్ నేత బండారు సత్యనారాయణకు కేటాయించగా పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించాడు. పెందుర్తి నుండి జనసేన నేత పంచకర్ల రమేష్ బరిలో దిగనున్నారు. పాడేరు సీటును గడ్డి ఈశ్వరికి కేటాయించారు. మొదట ఈ టికెట్ ను వెంకట రమేష్ కు కేటాయించగా ఇప్పుడు మార్పు చేశారు. మడకశిర నుండి సునీల్ కుమార్ స్థానంలో ఏం.ఎస్ రాజుకు ఛాన్స్ ఇచ్చారు. వేంకటగిరి స్థానాన్ని మొదట మాజీ ఎమ్మెల్యే కోరుగండ్ల రామకృష్ణ కుమార్తెకు కేటాయించగా తాజాగా ఆ టికెట్ ను రామకృష్ణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.