2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశమైన కూటమి శాసనసభాపక్ష నేతలు చంద్రబాబు సీఎంగా ఏగరీవంగా ఎన్నుకున్నారు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపరిచారు.
కూటమి తరఫున సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రజలు గత ఐదేళ్లుగా విధ్వంస పాలన చూశారని, ఈ ఎన్నికల్లో 57శాతం మంది ప్రజలు కూటమికి ఓటేసి గెలిపించారని అన్నారు. గతంలో గెలవని సీట్లు కూడా కూటమి గెలుచుకుందని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎప్పుడూ నిలబెట్టుకుంటామని అన్నారు చంద్రబాబు.కాగా, రేపు విజయవాడలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయటం ఇది నాలుగోసారి. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు.