ల్యాండ్​ టైటిలింగ్​పై చంద్రబాబు దుష్ప్రచారం: సీఎం జగన్​

మచిలీపట్నంలో సీఎం జగన్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సభలో జగన్​ మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించారు.  ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.  భూమిపై సంపూర్ణ హక్కులు కల్పిండమే ఈ యాక్ట్​ లక్ష్యమన్నారు.  భూ యజమానులకు, రైతన్నలకు అండగా ఉండే విధంగా భూ హక్కు పత్రాలను అందించే విధంగా చట్టాలను రూపొందించామన్నారు.  ఈ చట్టం అమల్లోకి రావాలంటే సమగ్ర భూ సర్వే జరగాలన్నారు. భూమిపై ఎలాంటి వివాదం లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. వివాదం వస్తే టైటిలింట్​ ఇన్సూరెన్స్​ చేయిస్తామన్నారు. ఇప్పటికే 6 వేల రెవిన్యూ గ్రామాల్లోసర్వే పూర్తయిందన్నారు.మరో రెండేళ్లలో మిగతా సర్వే కూడా పూర్తి చేస్తామన్నారు.  ల్యాండ్​ టైటిలింగ్​ మంచిదని గతంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్​అన్నారని మచిలీపట్నం సభలో అన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతు భూమి అయినా లాక్కున్నారా అని ప్రశ్నించారు. 

కిరాణా షాపుల్లో  గంజాయి అమ్ముతున్నారని ప్రచారం చేస్తున్న.. టీడీపీ.. తాను ఓడల్లో డ్రగ్స్​ సరఫరా చేస్తున్నారని ప్రచారం చేసిన చంద్రబాబు.. అవి వదినమ్మ కంపెనీలని రుజువయ్యేసరికి అంతా సైలంట్​ అయ్యారన్నారు.వృద్దులకు వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి పెన్షన్​ వచ్చేలా చర్యలు తీసుకుంటే.. చంద్రబాబు ఎన్​ రమేష్​ తో పిటిషన్​ వేయించి అవ్వలను, తాతలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. స్వయం ఉపాధి పథకాలకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.  లాయర్​ నేస్తం, వాహన మిత్ర లాంటి పథకాలు వైసీపీ హయాంలోనే రూపుదిద్దుకున్నాయన్నారు. 

గతంలో  ఎన్నడూ లేని విధంగా గ్రామ సచివాలయాల్లో 600 రకాల సేవలు.. వాలంటీర్లు.. ఇంటికే పెన్షన్​ లాంటి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం అయినా చేసిందా అని ప్రశ్నించారు.  మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం వైసీపీ పాలనలో జరిగిందన్నారు.  అలానే మెడికల్​ కాలేజీ నిర్మాణం, 350 కోట్ల రూపాయిలతో ఫిషింగ్​ హార్బర్​ నిర్మించామన్నారు.  2024 ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని మచిలీపట్నం సభలో సీఎం జగన్​ ఓటర్లను కోరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం గుర్తుకు రాదన్నారు. 2014లో  చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎన్నిహామీలుఒక్కయినా అమలయిందా అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఆడపిల్ల పుడితే మహలక్ష్మీ పథకం కింద రూ. 25 వేలు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, అర్హులకు 3 సెంట్ల స్థలం లాంటి హామీలే ఏమయ్యాయని సీఎం జగన్​ ప్రశ్నించారు.