కడప జిల్లాపై బాబు ఫోకస్ : ఫరూక్ తో కలిసి ఇవాళ ప్రచారం

ఇవాళ కడప జిల్లాలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కడప పట్టణంలోని అల్మాస్ పేట్ జంక్షన్ లో బహిరంగసభలో పాల్గొంటారు చంద్రబాబు. ఈ సభలో కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా , ఇతర మైనారిటీ నాయకులు పాల్గొనబోతున్నారు.

కడప జిల్లాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు ఏపీ సీఎం బాబు. రెండురోజుల కిందటే.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించారాయన. తాజా పర్యటనకు పెద్దసంఖ్యలో కార్యకర్తలను తరలిస్తున్నారు టీడీపీ శ్రేణులు.

కడప జిల్లాలో ప్రచారం ముగిసిన తర్వాత కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు చంద్రబాబునాయుడు.