సుదీర్ఘకాలం పాటు ఉత్కంఠ రేపిన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎట్టకేలకు కుదిరింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఢిల్లీలో మూడురోజుల పాటు పడిగాపులు కాసి మరీ బీజేపీతో డీల్ ఫిక్స్ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 6 అసెంబ్లీ సీట్లు, 5ఎంపీ సీట్లు కేటాయించేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నేతలకు బీజేపీతో పొత్తు ఆవశ్యకత గురించి వివరించిన ఆయన, ఈ పొత్తును ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ముఖ్య నేతలకు అప్పగించారు.
ALSO READ :- 28 ఏళ్ల తరువాత ఇండియలో మిస్ వరల్డ్ పోటీలు
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసమే ఈ పొత్తు అన్న బాబు, రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ నుండి త్వరలోనే ప్రకటన వస్తుందని అన్నారు. పొత్తు ఆవశ్యకత గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు మార్గదర్శకం చేసారు. బీజేపీతో పొత్తు, సీట్ల పంపకం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ నెల 11న కూటమి రెండో జాబితా ప్రకటిస్తారని తెలుస్తోంది. రెండో జాబితా ప్రకటన తర్వాత 14న ఢిల్లీలో జరగబోయే ఎన్డీఏ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొననున్నారు చంద్రబాబు.