రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకు 7 రకాల వైద్య పరీక్షలు జరిపారు. ఈ వివరాలతో కూడిన చంద్రబాబు హెల్త్ బులెటిన్ ను జైలు అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
Also Read :- ఛీ..ఛీ ఇంత నీచ రాజకీయాలా
చంద్రబాబు బీపీ సాధారణంగానే ఉండగా, ఫిజికల్ యాక్టివిటీ బాగున్నట్లు రాజమండ్రి జైలు అధికారులు తెలిపారు. నిమిషానికి 12 సార్లు శ్వాస తీసుకుంటుడగా, నిమిషానికి 62 సార్లు గుండె కొట్టుకుంటున్నట్లు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. ఊపిరితిత్తులకు ఏ సమస్యా లేదని చంద్రబాబు యాక్టివ్ గానే ఉన్నారని డాక్టర్ల టీమ్ జైలు అధికారులకు వివరించారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు వైద్య అధికారులు, రాజమండ్రి జీజీహెచ్ డాక్టర్స్ టీమ్ చంద్రబాబును సోమవారం ( అక్టోబర్23) పరీక్షించిన అనంతరం ఈ వివరాలు వెల్లడించారు.
చంద్రబాబు హెల్త్ బులెటిన్ వివరాలు....
- 1. రక్తపోటు- 140/80
- 2. శరీర ఉష్ణోగ్రత- సాధారణం
- 3. నాడి- 73
- 4. ఆక్సిజన్ శాచ్యురేషన్- 97 శాతం
- 5. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు 12 నిమిషానికి
- 6. హృదయ స్పందన- ఎస్1 , ఎస్2
- 7. ఊపిరిత్తులు- సాధారణం
- 8. శారీరక క్రియాశీలత- బాగుంది