రొయ్యకు మీసం.. బాబుకుమోసం పుట్టుకతోనే వచ్చాయి: సీఎం జగన్

రొయ్యకు మీసం.. బాబుకుమోసం  పుట్టుకతోనే వచ్చాయని భీమవరం సభలో సీఎం జగన్​ అన్నారు.  బాబు వస్తే జాబు రావడం కాదు..  ఉన్న జాబులు ఊడిపోతాయని సీఎం జగన్​ అన్నారు.జగన్​ ఒంటరి వాడు కాదు.. పేదల అండ ఉందన్నారు. లంచాలు, వివక్షత లేకుండా పాలన అందిస్తూ.. 2.70 లక్షల కోట్లను మహిళల ఖాతాలో జమ  చేశామన్నారు.   రైతులంతా జగనే రావాలి అంటున్నారని... మహిళలంతా జగన్​ కు అండగా ఉన్నారన్నారు. పిల్లలంతా మా మామే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. మంచి చేయడం మన ప్రోగ్రస్​ రిపోర్ట్... మోసం చేయడం చంద్రబాబు ట్రాక్​ రికార్డ్​ అన్నారు.

చంద్రబాబుది సెల్ఫ్​ డబ్బా

2014 ఎన్నికల్లో చంద్రబాబు సెల్ఫ్​ డబ్బా కొట్టుకున్నారన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు  జగన్​కు అనుభవం లేదని .. చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉందని ప్రచారం చేశాడని అన్నారు.   చంద్రబాబు అభివృద్ది డబ్బా ప్రచారం చేసి అప్పట్లో అధికారంలోకి వచ్చాడన్నారు.  ఆయన హయాంలో ఏ గ్రామంలో అయినా విలేజ్​ క్లినిక్​ కట్టాడా.. సింగపూర్​ కడతాం.. ఒలంపిక్స్​ నిర్వహిస్తామని ఊదరగొట్టారన్నారు.. అప్పుడు బాబు చెప్పినట్టు బుల్లెట్​ ట్రైన్​ వచ్చిందా.. కొత్తగా ఎయిర్​ పోర్ట్​ లు వచ్చాయా...  మైక్రోసాఫ్ట్​ వచ్చిందా...బాబు హయాంలో బడులు.. ఆస్పత్రులు బాగుపడ్డాయా అని ప్రశ్నించారు.  చంద్రబాబు ఏం చేశారని అభివృద్ది కింగ్​ అంటున్నారని ప్రశ్నించారు.   2014 లో రంగు రంగుల మ్యానిఫెస్టో చూపించి పేదలను మొసం చేశాడంటూ.. మహాలక్ష్మి పథకం ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఇచ్చాడా అని ప్రశ్నించారు.  రైతు రుణమాఫీపై తొలి సంతకం అన్నారు పెట్టాడా... ప్రతి నగరంలో హైటెక్​ సిటి అన్నారు.. ఎక్కడైనా ఉందా అని ప్రశ్నారు.  ప్రతి ఇంటికి ఉద్ ఉద్యోగం.. నిరుద్యోగ భృతి ఇస్తాఅన్నాడు.. ఇచ్చారా  అని సీఎం జగన్​ బీమవరం సభలో ప్రశ్నించారు.