
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారంటూ .. చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు అర్థరాత్రి నుంచి ప్రయత్నించగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన అనంతరం చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సంబంధించిన పేపర్లను చంద్రబాబుకు, లాయర్లకు సీఐడీ పోలీసులు చూపించారు. తనను ఏ చట్టప్రకారం అరెస్ట్ చేస్తున్నారని సీఐడీ పోలీసులపను చంద్రబాబు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చెప్పాలన్నారు. అధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదన్నారు. తాను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండని చంద్రబాబు అన్నారు.