టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా, అదే సమయంలో శివకుమార్ నాగ్‌పూర్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. దీంతో ఇరువురు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. మొదట మర్యాద పూర్వకంగా చేయిచేయి కలుపుకున్నఈ ఇరువురు నేతలు.. కాసేపు పక్కకెళ్లి సీక్రెట్‌గా మాటామంతీ జరిపారు. దీంతో వీరిద్దరి కలయికపై రకరకాల ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి.
కాంగ్రెస్‍తో కలిసి వెళ్తారా..!
డీకే శివకుమార్‌ను చంద్రబాబు కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన కాంగ్రెస్ తో కలిసి వెళ్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాలపై వీరిద్దరూ చర్చించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాలనే రాబోయే ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు అనుసరించాలని డీకే సూచించారని సమాచారం. ఎయిర్‌పోర్టులో ఎక్కువ సమయం లేకపోవడంతో దీనిపై మరోసారి కలిసి చర్చిద్దామని వీరిద్దరూ మాటాడుకున్నారని కథనాలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
KPCC Chief DK Shivakumar met TDP Chief Chandrababu Naidu at HAL Airport Bengaluru....... Coincidence ? ... @DKShivakumar @ncbn @KPCCPresident @JaiTDP pic.twitter.com/ymaHrm2adJ
— Yasir Mushtaq (@path2shah) December 28, 2023