ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయ్యింది. జూన్ 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్ దగ్గర ఏర్పాట్లు చేద్దామనుకున్నారు. అయితే అక్కడ అనువుగా లేనందున గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ప్రమాణస్వీకారానిక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు సీఎంలు,ఎన్డీయే పక్ష నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే సభా స్థలాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్థన్ రెడ్డి పరిశీలించారు.
జూన్ 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం కానుంది. టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదిక అందజేస్తారు. జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.