
మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. బురుగుపూడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో టిడిపి శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జగ్గంపేటలో పర్యటించారు. 16వ తేదీ జగ్గంపేట, పెద్దాపురం, 17వ తేదీ పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో చంద్రబాబు రోడ్‌షోలు నిర్వహిస్తారు.