ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతుంది. రెండవ రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వద్దకు శాంతిపురం మండలానికి చెందిన సదాకర్, ప్రియ దంపతుల వచ్చారు.
తమ కూతురికి నామకరణం చేయమని కోరారు. దంపతుల కోరిక మేరకు చరణిగా నామకరణం చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.