నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానంటున్న చంద్రబాబు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నేతల హడావిడి ముమ్మరం అయ్యింది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేరోజు ప్రచారం ప్రారంభించటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. తన హయాంలో సంక్షేమ పథకాల వల్ల జరిగిన మేలు గురించి వివరిస్తూ జగన్ ప్రచారం చేస్తుండగా, తమ ప్రభుత్వం వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలతో పాటు చేయబోయే అభివృద్ధి గురించి వివరిస్తూ చంద్రబాబు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానని అన్నాడు చంద్రబాబు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు, వృద్దులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్, నాడు, నేడు పథకం కింద స్కూళ్ళ, హాస్పిటల్లు ఆధునీకరణ, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో జగన్ రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపిస్తుంటే, చంద్రబాబు మద్యాన్ని చౌకగా అందించి ప్రజలను తాగుబోతులను చేసేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న లిక్కర్ పాలసీని విమర్శించబోయి ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లైంది పరిస్థితి చూస్తుంటే.