
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు లాయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన తరుపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చంద్రబాబు క్వాష్ పిటీషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని లూథ్రా వాదించారు.
Also Read : గ్రూప్ 1 రద్దు తీర్పును సవాల్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం
చంద్రబాబు ఎన్నిరోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ జస్టిస్ చంద్రమాడ్ అడిగారు. సెప్టెంబర్ 8న చంద్రబాబును అరెస్ట్ చేశారని లుథ్రా తెలిపారు. కేసు వివరాలు చెప్పేందుకు లూథ్రా ప్రయత్నించారు. రేపు మరోసారి మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలిని, అన్ని విషయాలు రేపే వింటామని సీజేఐ తెలిపారు.
కాగా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు లాయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు కేసును సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు.