ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు జీవితం ప్రజలకు తెలుసని అన్నీ అబద్ధాలు మోసాలేనని అన్నారు. చంద్రబాబు వల్ల ఒక్క మంచి అయినా జరిగిందా అని ప్రశ్నించారు. ఆవేశంలో ప్రజలు చంద్రబాబు అబద్ధాలు నమ్మద్దొని సూచించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు ప్రజలకు గౌరవాన్ని తీసుకు వచ్చారని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ విలువల్ని దిగజారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు మోసాల గురించి ఎన్టీఆర్ ఎన్నో చెప్పారని లక్ష్మీ పార్వతి అన్నారు. క్విట్ ఇండియా మూమెంట్ లాగా చంద్రబాబు క్విట్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదం రావాలన్నారు. చంద్రబాబు నిజాంగా అమిత్ షా ని కలిశారా.. కలిస్తే ఆధారం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ జీవితం కు ఎండ్ కార్డ్ పడిందని అన్నారు. షర్మిల దారి తప్పిన బాణమని విమర్శించారు. ఆ బాణం చంద్రబాబు గూటికి చేరిందని ఆమె గురించి ఏమి మాట్లాడతామని అన్నారు.