విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా.. స్పందించిన చంద్రబాబు..

విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది.కలుషిత నీటి వల్ల వ్యాపిస్తున్న డయేరియా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ఇప్పటికే డయేరియా వల్ల 9మంది మృతి చెందగా వందకు పైగానే బాధితులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టిపెట్టాలని కోరారు. కలుషిత నీరు సరఫరా చేయటం కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనిపై అధికారులు తక్షణమే బాధ్యత తీసుకోవాలని కోరారు చంద్రబాబు.

ప్రజల చావుకు కారణం డయేరియా కాదని, ఇతర ఆరోగ్య కారణాల వల్ల చనిపోయారని అధికారులు చెప్పటం సరికాదని అన్నారు.బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని, కలుషిత నీటిపై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.