చిత్తూరు: సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. డిసెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెప్పారు.
మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా మూడురోజుల పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. టీడీపీ జనసేన నేతలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి టీడీపీ కార్యాలయంలో నేతలతో సమావేశం అవుతారు.
- ALSO READ | ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల?
డిసెంబర్ 28,29,30 తేదీల్లో కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో ప్రజలతో మమేకమయ్యేందుకు చంద్ర బాబు విస్తృతంగా పర్యటిస్తారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.