నా గురించి గూగుల్ అంకుల్ను అడిగితే తెలుస్తుంది: చంద్రబాబు

హైదరాబాద్తో పాటు..తెలంగాణలో తాను చేసిన అభివృద్ధి గురించి గుగూల్  అంకుల్ను అడిగితే తెలుస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుకుడు చంద్రబాబు అన్నారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ కంపెనీలు రావడానికి ఫౌండేషన్ వేసిన ఘనత టీడీపీదేనని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ కు కంపెనీలు తరలివస్తున్నాయంటే..అందుకు టీడీపీ సృష్టించిన ఎకో స్టిస్టమే అని గుర్తు చేశారు. టెలిఫోన్ ఏ పరిస్థితిలో వచ్చిందో యువత గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ఐటీ కంపెనీలతో సైబరాబాద్ను నిర్మించామన్నారు. 
 

హైదరాబాద్ కు ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చేందుకు కృషి..

వయసులో పెద్దవాడిని అయినా.. టీనేజర్స్ ఎలా ఆలోచిస్తారో అలానే ఆలోచిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోట్ల కోసం పనిచేయలే.. తెలుగు జాతి కోసం, తెలుగు వారి కోసం పనిచేశానని చెప్పారు. ఖమ్మంలో బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. ఐటీ చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని అందుకే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు.హైదరాబాద్ అభివృద్ది అయిందంటే తన వల్లేనని బాబు అన్నారు. హైదరాబాద్ డెవలప్ మెంట్ వెనుక ఉండే శ్రమను గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. హైటెక్స్ సిటీని 14 నెలల్లోనూ పూర్తి చేశామన్నారు. ఉద్యోగాలు, ఉపాధి వస్తుందని కంపెనీల చుట్టూ తిరిగానని చెప్పారు. ఎన్నోసార్లు తిరిగితే కాని బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ దొరకలేదన్నారు. హైదరాబాద్‭కు ప్రపంచ పటంలో గుర్తింపు రావాలని.. ఆ రోజు ఐఎస్బీ కోసం పాటుపడ్డానని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, అన్నింటికి ఒక ఎఫర్ట్ ఉందని చంద్రబాబు చెప్పారు.