ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాల పేర్లను కొత్తగా కొలువైన చంద్రబాబు సర్కార్ మార్చేసింది. విద్యావ్యవస్థలో పలు పథకాలకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించినట్లు ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొత్తగా కొలువుదీరిన ప్రజా ప్రభుత్వంలో గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నారు. రాష్ట్రంలోని విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దుతామన్నారు. పాత పేర్ల స్థానంలో విద్యారంగంలో విశేష సేవలందించిన భరత మాత ముద్దు బిడ్డల పేర్లను ఆయా పథకాలకు పెట్టాలని నిర్ణయించామన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నూతన పథకాల పేర్లను ప్రకటించారు.
మార్చిన పథకాల పేర్లు ఇవే.!
జగనన్న అమ్మ ఒడి – తల్లికి వందనం
జగనన్న విద్యా కానుక – సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర
జగనన్న గోరుముద్ద – డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం
మన బడి నాడు నేడు – మన బడి మన భవిష్యత్తు
స్వేచ్ఛ – బాలికా రక్ష
జగనన్న ఆణిముత్యాలు – అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం
అయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. ఇందులో భాగంగా తొలుత గత ప్రభుత్వం నాటి… pic.twitter.com/r9O8C0EuW1
— Lokesh Nara (@naralokesh) July 27, 2024