పెన్షన్ పంపిణీలో సీఎం చంద్రబాబు సంచలనం.. దేశ చరిత్రలోనే తొలిసారి..

పెన్షన్ పంపిణీలో సీఎం చంద్రబాబు సంచలనం.. దేశ చరిత్రలోనే తొలిసారి..

ఆంధ్రప్రదేశ్ సీఎంగా నాలుగవసారి ప్రమాణం చేసిన చంద్రబాబు పాలన పరంగా తనదైన మార్క్ దిశగా అడుగులేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే పలు శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ పోలవరం అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.ఇదిలా ఉండగా,జులై 1న పెన్షన్ ను స్వయంగా చంద్రబాబే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఒక సీఎం ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు నగదు పంపిణీ చేయటం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు.ఇందులో భాగంగా పెన్షన్ పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికారు.తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.

గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్ చేయగా, కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే పెన్షన్ 4వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. అంతే కాకుండా పెన్షన్ పెంపును ఏప్రిల్ నుండే వర్తింప చేస్తూ జూలై 1న 7వేల రూపాయల పెన్షన్ అందజేయనుంది ప్రభుత్వం.