కూటమి తరఫున సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినవారిని వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే అది అలవాటుగా మారుతుందని అన్నారు.తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని, విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అన్నారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని, వినయంగా ఉండాలని కూటమి శ్రేణులకు స్పష్టం చేశారు.
సీఎంగా 12న ప్రమాణస్వీకారం చేయనున్న క్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు వ్యాఖ్యలు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను ఉదేశించి చేసినవేనా అన్న అనుమానం కలుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వైసీపీ శ్రేణులపై కూటమి శ్రేణులు దాడులను ఖండిస్తూనే చంద్రబాబు ఇలా వార్నింగ్ ఇవ్వడం ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. అసలే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఓటమి భారంతో కుంగిపోయిన వైసీపీ శ్రేణులను బాబు వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి.