ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారీ ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న మోడీకి చంద్రబాబు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఒకే కారులో సభాస్థలికి చేరుకున్నారు మోడీ, చంద్రబాబు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మోడీ, బాబుల ఆత్మీయ ఆలింగనం కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.సినీ ఇండస్ట్రీ నుండి రజినీకాంత్ సతీసమేతంగా హాజరు కాగా, మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ హోదాలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇదిలా ఉండాగా, ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.